Arjun S/O Vyjayanthi | తెలుగు కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి కీలక పాత్రలో నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రం ఇప్పుడు మరో ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రానుంది. ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం థియేటర్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలావుంటే మే 23, 2025 నుండి ఆహా (Aha) ఓటీటీలో కూడా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అందుబాటులోకి వస్తుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ సినిమా మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కానుంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటించారు. తల్లీకొడుకుల సెంటిమెంట్, యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. వైజయంతి (విజయశాంతి) నిజాయితీగల ఐపీఎస్ అధికారిణి. ఆమెకు అర్జున్ (కళ్యాణ్ రామ్) ఒక్కగానొక్క కొడుకు. అర్జున్ను ఐపీఎస్ ఆఫీసర్‌గా చూడాలనేది వైజయంతి కల. అందుకు తగ్గట్టే అతన్ని ఐపీఎస్ చదివించి, ట్రైనింగ్ కోసం ఢిల్లీ పంపిస్తుంది. ఏడాది ట్రైనింగ్ పూర్తి చేసుకొని తిరిగిరావాల్సిన అర్జున్, వెళ్లిన ఐదోరోజే తిరిగి వచ్చేస్తాడు. దీనికి కారణం తన తండ్రి మరణం. నావీ అధికారి అయిన తన తండ్రి సముద్రంలో ప్రమాదవశత్తూ మరణించాడని పోలీసులు చెబుతారు.
నిజానికి అర్జున్ తండ్రి మరణానికి కారణం ప్రమాదం కాదు, అదొక హత్య. ఆ విషయం తెలుసుకున్న అర్జున్, తన తండ్రిని చంపిన వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. అయితే వైజయంతి అతన్ని వారిస్తుంది. చట్టప్రకారం దోషులకు శిక్ష పడేలా చేస్తానని, నువ్వు ఐపీఎస్ పూర్తి చేయాలని చెప్పి కొడుకుని మళ్లీ ట్రైనింగ్‌కి పంపించేస్తుంది.
సంవత్సరం తర్వాత అర్జున్ ట్రైనింగ్ ముగించుకొని తిరిగి వస్తాడు. సరిగ్గా అదే రోజు తన తండ్రి కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ ఉంటుంది. అర్జున్ తండ్రిది హత్య కాదని, అది ప్రమాదవశత్తే జరిగిందని కోర్టు తీర్పు ఇస్తుంది. హంతకులు కోర్టు నుంచి బయటకొస్తూనే వైజయంతిని అవమానకరంగా మాట్లాడతారు. అన్యాయం ముందు చట్టం, న్యాయం ఓడిపోవడం, తన కళ్లారా తల్లిని అవమానిస్తుంటే అర్జున్ తట్టుకోలేకపోతాడు. అతని కోపం కట్టలు తెంచుకుంటుంది. కోర్టు ఎదురుగానే హంతకుడ్ని కొట్టి చంపేస్తాడు. అంతేకాదు, తన తండ్రి హత్యకు కారణమైన ముఠాలోని 41 మందిని నరికి చంపేస్తాడు. ఐపీఎస్ కావాల్సిన కొడుకు కంటిముందే హంతకుడుగా మారడం చూసిన వైజయంతి మూగబోతుంది. గూండాగా మారిన కొడుకు మీదే యుద్ధానికి సిద్ధమవుతుంది. మరి విధి విడదీసిన ఈ తల్లీబిడ్డలు మళ్లీ ఎలా కలిశారు? ఐపీఎస్ అవ్వాల్సిన అర్జున్ గూండాగా మారి సాధించిందేంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.
What happens when a police officer’s son becomes the law himself?
A gripping tale of justice, rebellion, and blood ties
#ArjunSonofVyjayanthi premieres May 23, on aha.@NANDAMURIKALYAN @vijayashanthi_m @saieemmanjrekar @SohailKhan @Dirpradeepch
@SunilBalusu1981 @muppaav… pic.twitter.com/p0UtkPd9E6— ahavideoin (@ahavideoIN) May 21, 2025