కల్యాణ్‌రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. విజయశాంతి కీలక పాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూజిక్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టారు. ఈ నెల 31న ‘నాయాల్ది’ అంటూ సాగే తొలి గీతాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా పాట తాలూకు పోస్టర్‌ను విడుదల చేశారు. ఉత్సవం నేపథ్యంలో సాగే మాస్ పాట ఇదని, కల్యాణ్‌రామ్ నృత్యాలు, అజనీష్లోక్నాథ్ సంగీతం హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. సాయిమంజ్రేకర్, సోహైల్‌ఖాన్, శ్రీకాంత్, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు, రచన-దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి.