Bhagwant kesari | టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో వస్తున్న చిత్రం భగవంత్ కేసరి (Bhagwant kesari). మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఎన్బీకే 108 (NBK 108) ప్రాజెక్ట్‌గా వస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (arjun rampal) కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. పెళ్లి సందD ఫేం శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా అప్డేట్ వచ్చింది. అర్జున్ రాంపాల్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు.
ఇది నా సినిమా భగవంత్‌కేసరి షూటింగ్ పూర్తయిన సమయం. నా తొలి తెలుగు సినిమా షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను. షూటింగ్ పూర్తి స్థాయిలో జరిగిందని.. నేనిప్పుడు చాలా నిశ్చింతగా చెప్పగలను. నా పెద్ద అన్నయ్య బాలకృష్ణ శక్తి లేకుండా ఇదంతా సాధ్యం కాదు. బ్రో మీ అద్భుతమైన శక్తికి, ప్రేమకు ధన్యవాదాలు. లవ్ యూ. నా ప్రియమైన తమ్ముడు అనిల్ రావిపూడికి ధన్యవాదాలు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా బాలయ్యను అర్జున్ రాంపాల్ ఆత్మీయంగా హగ్ చేసుకున్నాడు. భగవంత్ కేసరి టీంకు గుడ్‌బై. 2023 oct 19 థియేటర్లలో కలుద్దాం..అంటూ అని ట్వీట్ చేశాడు.
ఇప్పటివరకు రాయలసీయ యాసలో అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించిన బాలయ్య.. తాజా ప్రాజెక్ట్‌లో తెలంగాణ యాసలో సరికొత్త వినోదాన్ని అందించబోతున్నాడని ఇప్పటికే విడుదల చేసిన రషెస్ చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు గూస్ బంప్స్ తెప్పించే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఎస్ థమన్ మరోసారి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
భగవంత్ కేసరితో అర్జున్ రాంపాల్..
It’s a wrap for me on my film #bhagwantkesari I was so nervous when I came here to shoot my first Telugu film. I can confidently say now have had an absolute blast filming it. All this would not have been possible without the energy of my big brother #balakrishna thank you bro… pic.twitter.com/urHmQeQ070
— arjun rampal (@rampalarjun) August 14, 2023
భగవంత్ కేసరి టీజర్..