అరియానాతో జిమ్‌లో కుస్తీలు పడుతున్న వర్మ

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమంతో చాలా పాపులర్ అయిన కంటెస్టెంట్ అరియానా. గతంలో ఈ అమ్మడికి వర్మ ద్వారా కాస్త పాపులారిటీ దక్కింది. ఓ ఇంటర్వ్యూలో అరియానా బాడీపై వర్మ పలు కామెంట్స్ చేయడంతో ఆ వీడియో వైరల్ కాగా, అరియానా అందరి దృష్టిలో పడింది. బిగ్ బాస్‌తో ఫుల్ పాపులర్ అయింది. ఇక ఇప్పుడు టీవీ షోస్, సినిమాలతో బిజీ బిజీగా ఉంది అరియానా.
ఒక రకంగా చూస్తే అరియానా కెరియర్‌కు వర్మ చాలా సపోర్ట్ చేశాడనే చెప్పాలి. బిగ్ బాస్ టైంలోను ఆమెకు తన సపోర్ట్ అందించాడు. ఇటీవల గోవాలో వర్మని కలిసిన అరియానా ఆయనతో ఫొటోలు దిగి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక తాజాగా వర్మని ఇంటర్వ్యూ చేసే క్రమంలో మరో సారి వర్మని కలిసింది. ఈ సారి ఇద్దరి ఫొటోలను ఆర్జీవి తన ట్విట్టర్లో షేర్ చేశాడు. బిగ్ బాస్ లిటిల్ బ్యూటీ అరియానా గ్లోరీ జిమ్ లో ఉండగా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. ఇద్దరం కలిసి వర్కౌట్ చేశాం . ఇంటర్వ్యూ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుందని పేర్కొన్నాడు. మొత్తానికి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అరియానాతో కూడా వర్మ జిమ్ చేయించడాని ఫొటోలని చూస్తుంటే అర్దమవుతుంది.
ఇవి కూడా చదవండి..
బలవంతపు ఆమోదం కోసమే..
ఫేక్ న్యూస్‌పై ఫిర్యాదుకు 87997 11259
నేడు రక్షణశాఖ సమావేశం.. ప్రాజెక్టు-75పై చర్చ
ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్.. భయాందోళనకు గురైన స్థానికులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ariyana
- ram gopal varma
- rgv
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

