అరి అరుజునన్, రాజ్‌తరుణ్, భరత్, అమూ అభిరామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ట్రైజర్ పేరుతో ఓ వీడియోను ప్రముఖ దర్శకుడు హరీశ్‌శంకర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మిల్టన్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ.. వాస్తవికతను ప్రతిబింబిస్తూ సామాజిక అంశాల నేపథ్యంలో రూపొందించిన చిత్రమిదని, హీరో అరి అరుజునన్ పోలీస్ పాత్రలో కనిస్తారని, రాజ్‌తరుణ్ ఈ సినిమా ద్వారా తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామని నిర్మాణ సంస్థ రఫ్‌నోట్ ప్రొడక్షన్స్ పేర్కొన్నది.