Johnny Master | ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల ఆస్కార్ విజేత, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్‌తో కలిసి ఒక ఫొటో దిగిన విషయం తెలిసిందే. ఈ ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు జానీ. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఘటన జరిగింది. అయితే జానీ ఈ ఫొటోను పంచుకున్న వెంటనే కొంతమంది నెటిజన్లు లైంగిక ఆరోపణలు (Sexual Harassment Allegations) ఎదుర్కొన్న వ్యక్తితో కలిసి ఫోటో దిగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రెహమాన్‌ని తప్పుబట్టడమే కాకుండా జానీ మాస్టర్‌పై విమర్శలు గుప్పించారు. దీనికి సంబంధించిన వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే జానీ మాస్టర్ వివాదం విషయం రెహమాన్‌కి తెలియదని అందుకే అతనితో కలిసి దిగి ఉంటాడని పలువురు ఆరోపిస్తున్నారు. సింగర్ చిన్మయ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. రెహమాన్ సర్కి ఈ వివాదం గురించి తెలియదు. తెలిసి ఉంటే అతడితో కలిసి దిగి ఉండకపోవచ్చంటూ చిన్మయి తెలిపింది. మరోవైపు లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని మళ్లీ సినిమాల్లోకి ఎలా తీసుకున్నారంటూ చిత్రబృందం ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
OH please shut up. I asked Sir – and he had no idea. I have called out even the CM and the biggest actors in Tamil film industry. YOU ARE NOT the one going to Court and getting harassed. So stop haranguing me when other powerful men employ a molester.
YOU All can call out your…
— Chinmayi Sripaada (@Chinmayi) November 10, 2025