ప్రస్తుతం ప్రపంచమంతా అంబానీ ఇంట పెండ్లి వేడుక గురించే చర్చిస్తున్నది. అంగరంగ వైభవంగా జరిగిన పెండ్లి సందడికి బాలీవుడ్, టాలీవుడ్ సెలెబ్రిటీలు తరలి వెళ్లారు. వివిధ రంగాలకు చెందిన హేమాహేమీలు ఎందరో హాజరయ్యారు. బాలీవుడ్ స్టార్లయితే స్టెప్పులు కూడా వేశారు. ఈ సందడిపై ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
‘నన్ను ఓ భారీ ఈవెంట్‌కు ఆహ్వానించారు. కానీ, వారితో నేను రానని స్పష్టంగా చెప్పాను. ఎందుకంటే నాకు ఆత్మగౌరవం ఉంది. ఒకరి పెండ్లిలో నన్ను నేను అమ్ముకోవడం కంటే నాకు గౌరవమే ముఖ్యం. ఆ వివాహానికి ఎన్నిసార్లు ఆహ్వానించినా తిరస్కరించాను. అది పెండ్లిలా కాకుండా సర్కస్‌లా మారింది’ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆమె కామెంట్స్‌పై నెటిజన్లు ఒక్కొక్కరూ ఒక్కోరకంగా స్పందిస్తున్నారు. ఎవరేం అనుకున్నా.. తన ఫీలింగ్ అదేనని చెబుతున్నది ఆలియా.