Anupama Parameswaran | ది మోస్ట్ అవైటెడ్ టిల్లు స్క్వేర్ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంటుంది.. సిద్దూ జొన్నలగడ్డ మళ్లీ హిట్ అందుకుంటాడా లేదా.. ఇలాంటి వాటి కంటే కూడా అనుపమ పరమేశ్వరన్ కోసమే ఈ సినిమా చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. అమ్మడు ఈ సినిమా కోసం ఫుల్‌గా గ్లామర్ షో చేసింది. ఇన్నేళ్లు అందం ఉంది.. అభినయం ఉంది.. అద్భుతమైన టాలెంట్ కూడా ఉంది.. కానీ ఈమెకు అవకాశాలు మాత్రం రావట్లేదు. ఆమె కంటే తర్వాత వచ్చి ఏ మాత్రం టాలెంట్ లేకుండా కేవలం అందాల ఆరబోతతో స్టార్ హీరోయిన్లు అయిన వాళ్లు చాలామంది ఉన్నారు.
కెరీర్ మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన అనుపమ.. ఆ తర్వాత అదే జోరు కంటిన్యూ చేయడంలో దారుణంగా విఫలమైంది. పైగా రంగస్థలం లాంటి కొన్ని సినిమాలు చేజేతులా వదిలేసుకోవడంతో ఈ అమ్మడు కెరీర్ అప్పుడే గాడి తప్పింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు డజన్ సినిమాలు చేసింది కానీ.. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా రాలేదు. మధ్యలో కొన్ని సినిమాలు అయితే ఎప్పుడు వచ్చి వెళ్లిపోయాయో కూడా తెలియదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రేసులో ఉన్న అనుపమ పరమేశ్వరన్.. ఇప్పుడు కనీసం మీడియం రేంజ్ హీరోయిన్ కూడా కాదు. గ్లామర్ షో చేస్తున్నా.. ఈమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు అయితే రావడం లేదు. దాంతో మరింత గ్లామర్ డోస్ పెంచాలని ఫిక్స్ అయిపోయింది అనుపమ.
దానికి డీజే టిల్లు సీక్వెల్ నిదర్శనంగా నిలవనుంది. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా వస్తున్న ఈ సినిమాను మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. మార్చి 29న సినిమా విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్లో లాంగ్ లిప్ లాక్ ఇచ్చింది అనుపమ. ఈ ఒక్క సీన్ తో ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వస్తాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సీన్లో కనిపిస్తున్న తీరును బట్టి అనుపమ సినిమాలో ఏ రేంజ్లో రెచ్చిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కచ్చితంగా ఈ సినిమా తర్వాత అనుపమ మళ్లీ టాలీవుడ్లో బిజీ అవుతుందని నమ్ముతున్నారు ఆమె అభిమానులు.
మరోవైపు ఈ కేరళ కుట్టి కూడా అవకాశాల కోసం హాట్ షోతో పాటు ఇంటిమేట్ సీన్స్ చేయడానికి కూడా రెడీ అన్నట్టు సిగ్నల్స్ ఇచ్చేస్తుంది. రెండు సంవత్సరాల కింద దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటించిన రౌడీ బాయ్స్ సినిమాలోనే లిప్ లాక్ సీన్స్ తో పాటు హాట్ హాట్ సన్నివేశాలు కూడా చేసింది అనుపమ. ఇప్పుడు టిల్లు గాడి కోసం మరింత రెచ్చిపోయింది. మరి ఈ తెగింపు అనుపమ కెరీర్‌కు ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.