Anupama Parameshwaran Butterfly movie | అటు గ్లామర్ పాత్రలు.. ఇటు నటన ప్రాధాన్యం ఉన్న పాత్రలతో మెప్పిస్తోంది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్. ఈ ఏడాది రౌడీ బాయ్స్ చిత్రంతో పలకరించిన ఈ కేరళ కుట్టి మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. బటర్ ఫ్లై చిత్రంతో రాబోతున్నది. అనుపమ బర్త్ డే సందర్భంగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా టీజర్‌ను మేకర్స్‌ను విడుదల చేశారు.
ఎలాంటి డైలాగ్స్ లేకుండా బటర్ ఫ్లై టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్‌ను గమనిస్తే స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న ఇద్దరు పిల్లలు కనిపించకుండాపోతారు. వాళ్లను వెతికే పనిలో అనుపమ పరమేశ్వరన్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయనే క్యూరియాసిటీని ఈ టీజర్ కలిగిస్తుంది. నీ కళ్లను నమ్మొద్దు.. నీ బ్రెయిన్‌ను నమ్మొద్దు.. మరి దేన్ని నమ్మాలి అంటూ ఆద్యంతం ఉత్కంఠభరితంగా టీజర్ సాగింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అర్విజ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఓవరల్‌గా ఈ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లు టీజర్‌ను చూస్తే తెలుస్తుంది. నిహాల్ కోదత్య్, భూమిక చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఘంటా సతీష్‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్‌పై రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరవళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.