Anupam Kher | దేశవ్యాప్తంగా ప్రస్తుతం నకిలీ కరెన్సీలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. కొందరు నేరగాళ్లు నకిలీ నోట్లను ముద్రించి మర్కెట్లో చలామణీ చేస్తున్నారు. అయితే వీరిని పట్టుకోవడం పోలీసులకు కత్తి మీదా సాములా మారింది. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని చర్యలు తీసుకున్న పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోతున్నాయి. అయితే నకిలీ నోట్లకు సంబంధించిన ఒక ముఠాను తాజాగా అహ్మదాబాద్ పోలీసులు రెండ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే పోలీసులకు పట్టుకున్న ఆ ముఠా దగ్గరున్న నోట్లను చూసి అధికారులు షాక్ అయ్యారు.
వారి వద్ద రూ.500 నోట్లలో నోట్లలో మహాత్మ గాంధీకి బదులుగా బాలీవుడ్ నటుడి బోమ్మ ఉంది. అవును రూ.500 నోట్లలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ చిత్రం ఉంది. అలాగే ఈ నోట్లపై ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘రిసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ముద్రించారు. ఈ నోట్లను ఉపయోగించి బంగారం కోనడానికి ప్రయత్నం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.1.60 కోట్ల విలువైన ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
అయితే రూ.500 నోటుపై అనుపమ్ ఖేర్ ఫోటో ఉండడంతో దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారాయి. ఇక ఈ విషయం అనుపమ్ ఖేర్ దగ్గరికి కూడా వెళ్లగా.. అతడు స్పందిస్తూ.. రూ.500 నోట్లపై గాందీజీ ఫోటోకు బదులుగా నా ఫోటోనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ కాలంలో ఏదైనా జరగవచ్చు అంటూ రాసుకోచ్చాడు.