Anup Rubens | ప్రముఖ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా అనూప్ రూబెన్స్
ఇటీవలే అక్కినేని నాగార్జున , కల్యాణ్‌కృష్ణ కాంబినేషన్లో వచ్చిన బంగార్రాజు (Bangarraju) సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ (Anup Rubens). ఈ మ్యూజిక్ డైరెక్టర్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
సినిమా పెద్దదైనా, చిన్నదైనా..వేటితో సంబంధం లేకుండా సూపర్ హిట్ ఆల్బమ్స్ ను అందిస్తుంటాడు యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ (Anup Rubens). ఇటీవలే అక్కినేని నాగార్జున , కల్యాణ్‌కృష్ణ కాంబినేషన్లో వచ్చిన బంగార్రాజు (Bangarraju) సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ మ్యూజిక్ డైరెక్టర్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. హవా ఫ్యాన్స్ (Hawa fans)కంపెనీకి అనూప్ రూబెన్స్ బ్రాండ్ అంబాసిడర్ (Brand ambassador)గా మారాడు. అంతేకాదు ఈ కంపెనీలో అనూప్ రూబెన్స్ భాగస్వామిగా కూడా ఉన్నారట.
హవా ఫ్యాన్స్ కంపెనీని అనూప్ రూబెన్స్ స్నేహితుడు అనిల్ నిర్వహిస్తున్నారు. ఏడాది క్రితం మొదలైన ఈ కంపెనీకి తాజాగా అనూప్ రూబెన్స్ ప్రచారకర్తగా నియామకం కావడంతో..ఈ బ్రాండ్ మరింత పాపులర్ కానుంది. మనం, గోపాలా గోపాలా, సోగ్గాడే చిన్నినాయనే లాంటి సూపర్ హిట్ పాటలను ప్రేక్షకులకు అందించిన అనూప్..ప్రస్తుతం శేఖర్, ఓదెల రైల్వే స్టేషన్, విక్రమాదిత్య సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Read Also : Armaan Malik | నన్ను నమ్మండి..మహేశ్ బాబు ఫ్యాన్స్ కు సింగర్ అర్మాన్ మాలిక్ ట్వీట్
చెతక్ శీను, కోతి కొమ్మచ్చి, ప్రేమ కాదంట చిత్రాలతోపాటు కథలు అనే వెబ్‌సిరీస్ కూడా చేస్తున్నాడు. 2004లో వచ్చిన జై సినిమాతో మ్యూజిక్ కంపోజర్‌గా ఎంట్రీ ఇచ్చిన అనూప్ రూబెన్స్..టాలీవుడ్లో వన్ ఆఫ్ ది లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా నిలిచాడు.
Read Also : Ram Boyapati Movie | రామ్-బోయపాటి సినిమాపై నో అప్డేట్..కారణమదేనా..?
Read Also : Selfish Poster | ‘సెల్ఫిష్’గా మారిపోయిన యువ హీరో..హిట్టు పడేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

