Ante Suundaraniki Trending in Netflix | ఫలితంతో సంబంధంలేకుండా కొత్త కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు నాని. ప్రతి సినిమాకు వేరియేషన్ చూపిస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏడాదికి రెండు,మూడు సినిమాలను విడుదల చేస్తూ టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. ఇక ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘అంటేసుందరానికీ’ జూన్ 12న విడుదలై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించలేకపోయింది. నాని గత సినిమాలతో పోల్చితే ఈ చిత్రం లోయెస్ట్ ఓపెనింగ్స్ తీసుకువచ్చింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 10నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో అరుదైన ఘనతను సాధించింది.
‘అంటే సుందరానికీ’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం గత ఆదివారం నుండి ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్ టాప్10లో తెలుగు, మలయాళ భాషల్లో ట్రెండింగ్ అవుతుంది. థియేటర్లో ఈ సినిమా హిట్టు కాకపోయినా ఓటీటీలో మంచి విజయం సాధించింది. నజ్రియా హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. వివేక్ సాగర్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో నాని బ్రాహ్మణుడిగా నటించిగా.. నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా నటించింది. ప్రస్తుతం నాని ‘దసరా’ సినిమాను చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓడెలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి పాన్ ఇండియా లెవల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.
నాని సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీ కలెక్షన్లను రాబట్టలేకపోతున్నాయి. నాని గత నాలుగైదు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించలేకపోయాయి. ఈ విషయంలో నాని కాస్త ఆలోచించాలని నెటీజన్లు అభిప్రాయపడుతున్నారు. నాని కథల ఎంపిక, డైరెక్టర్ల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కామెంట్స్ చేస్తున్నారు.
#AnteSundaraniki & #AdadeSundara are trending in Top 10 movies since a week 🤩
Have you watched it yet on @NetflixIndia?@NameisNani #NazriyaFahadh #VivekAthreya @oddphysce @nikethbommi @saregamasouth pic.twitter.com/05qyiZ5XBV
— Mythri Movie Makers (@MythriOfficial) July 17, 2022