Nani | ఇలాంటి సినిమాలు చాలా అరుదు..కలెక్షన్లు ప్రేక్షకులకే వదిలేద్దాం: నాని
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) చిత్రానికి వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వం వహించాడు. జూన్ 10న విడుదలైన ఈ మూవీ నాని మార్క్ యాక్టింగ్ స్టైల్‌తో అభిమానులు, మ్యూజిక్ లవర్స్ కు వినోదాన్ని పంచుతుంది.
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ హీరో నాని (Nani), నజ్రియా నజీమ్ (Nazriya) కాంబోలో వచ్చిన చిత్రం ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki). రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వం వహించాడు. జూన్ 10న విడుదలైన ఈ మూవీ నాని మార్క్ యాక్టింగ్ స్టైల్‌తో అభిమానులు, మ్యూజిక్ లవర్స్ కు వినోదాన్ని పంచుతుంది. అయితే ప్రస్తుతానికి నాని గత చిత్రాలతో పోలిస్తే బాక్సాపీస్ కలెక్షన్లు తక్కువగా ఉన్నాయని ట్రేడ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.
అయితే ఈ సినిమాను కమర్షియల్ యాంగిల్లో చూడొద్దంటున్నాడు నాని. సక్సెస్ మీట్లో నాని మాట్లాడుతూ..మేమంతా దీన్ని బ్లాక్ బాస్టర్ ఈవెంట్‌గా జరుపుకోవడం పట్ల మీకు సందేహాలుండొచ్చు. అయితే మేం జరుపుకుంటున్న వేడుక బాక్సాపీస్ ఫిగర్స్ కోసం కాదు..ప్రేక్షకుల ప్రేమ, మనస్సులు గెలుచుకున్నామనే సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల లైన్‌ను బ్రేక్ చేసి..ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే అంటే సుందరానికి వంటి సినిమాలు మనకు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇక ఈ సినిమా బ్లాక్ బాస్టరా..? కాదా..? అనేది కాలమే చెబుతుందన్నాడు నాని.
ఈ సినిమా కలెక్షన్లను ఇతర కమర్షియల్ సినిమాలతో పోల్చవద్దని నాని కోరాడు. ప్రతీ సినిమాకు మాస్ సినిమాల్లాగా కలెక్షన్లుండవు. బాక్సాపీస్ కలెక్షన్లను ఆడియెన్స్ కే వదిలేద్దాం. సినిమాపై చూసినవాళ్ల నుంచి నాకొస్తున్న మెసేజ్‌లు ఆనందాన్నిస్తున్నాయి. ఈ సినిమా నా కెరీర్లో మరుపురాని సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశాడు నాని.
Read Also : Kamal Chiru | కమల్ హాసన్, చిరంజీవి అప్పుడు..ఇప్పుడు..ట్రెండింగ్‌లో స్టిల్
Read Also : Sai Dharam Tej | లైట్స్ అండ్ షాడోస్..సాయిధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్
Read Also : Spider Man | ఓటీటీలోకి ‘స్పైడర్ మ్యాన్:నో వే హోమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Read Also : Ante Sundaraniki Review | అంటే సుందరానికీ రివ్యూ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

