Stand-up Comedian | మరో స్టాండప్ కమెడియన్ అరెస్ట్.. పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలే కారణం!
PawanKalyan | ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో విశాఖపట్నానికి చెందిన స్టాండప్ కమెడియన్ రఫీక్ మొహమ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Standup Comedian | ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో విశాఖపట్నానికి చెందిన స్టాండప్ కమెడియన్ రఫీక్ మొహమ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కామెడీ షోల ద్వారా వీరిద్దరి వ్యక్తిగత జీవితాలపై వ్యంగ్య విమర్శలు చేసిన వీడియోలు వైరల్ కావడంతో, మచిలీపట్నానికి చెందిన జనసేన నాయకుడు సాయన శివనారాయణ ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. గురువారం రాత్రి విశాఖలోని రఫీక్ నివాసానికి వెళ్లిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, అక్కడి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా మచిలీపట్నం తరలించారు. కొద్దిరోజుల క్రితమే ఇదే తరహా ఆరోపణలతో అనుదీప్ కటికల అనే మరో కమెడియన్‌ను కాకినాడ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేయగా, ఇప్పుడు రఫీక్ మొహమ్మద్ అరెస్ట్ కావడం టాలీవుడ్ మరియు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రఫీక్ వ్యక్తిగత వివరాలు నెట్టింట లీక్ కావడంతో అతడికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సమాచారం అందుతుండగా, ప్రజాప్రతినిధులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

