అఖండ2 సినిమాకు టికెట్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోరులో శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు శారు. లంచ్ మోషన్ పిటిషన్ విచారించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. టికెట్ ధరలతో పాటు ప్రత్యేక షోల నిర్వహణపై కూడా హైకోర్టు విచారణ జరపనున్నట్లు సమాచారం. అఖండ2 మూవీ వాస్తవానికి డిసెంబర్ 5న విడుదల కావలసి ఉంది. పలు కారణాల వలన వాయిదా పడింది. ఇక ఎట్టకేలకి డిసెంబర్ 12న రిలీజ్ చేయడానికి మేకర్స్ డిసైడయ్యారు. ఈ రోజు రాత్రి ప్రీమియర్ షోలు నడపడానికి కూడా ఏర్పాట్లు చేశారు.
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ఈ సీక్వెల్‌కు అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి అనే చెప్పాలి. విడుదల వాయిదా పడినప్పటికీ సినిమాపై ఉన్న క్రేజ్ మాత్రం రెండింతలు పెరిగింది.