‘పుష్ప’ చిత్రంలో ‘ఊ అంటావా మావ’ పాటతో యువతరాన్ని ఉర్రూతలూగించింది అగ్ర కథానాయిక సమంత. తాజా సమాచారం ప్రకారం ఈ భామ హిందీ స్పైథ్రిల్లర్ ‘ఆల్ఫా’లో ఓ స్పెషల్‌సాంగ్‌ను చేయబోతున్నట్లు తెలిసింది. యష్‌రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ స్పైథ్రిల్లర్లో అలియాభట్, శార్వరీ వాఘ్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. శివ్ రావేల్ దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ఓ ప్రత్యేక గీతం కోసం మేకర్స్ సమంతను సంప్రదించారని, ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉందని వార్తలొస్తున్నాయి.
ఈ పాటలో ఈ భామతో పాటు మరికొందరు కథానాయికలు కూడా నర్తించనున్నారని టాక్. ‘పుష్ప’ తర్వాత సమంతకు పలు భారీ సినిమాల్లో స్పెషల్సాంగ్స్ ఆఫర్లొచ్చినా ఆమె తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ‘ఆల్ఫా’ చిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్ గురించి అభిమానుల్లో చర్చ నడుస్తున్నది. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ప్రస్తుతం సమంత స్వీయ నిర్మాణంలో రూ పొందిస్తున్న ‘మా ఇంటిబంగారం’ చిత్రంలో నటిస్తున్నది.