అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌రెడ్డి’. స్మరణ్ రెడ్డి నిర్మాత. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘యథార్థ ఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందించాం. అన్ని కేంద్రాల్లో మంచి స్పందన లభిస్తున్నది.
ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీతో పాటు సినిమాలోని కామెడీ అందరిని ఆకట్టుకుంటున్నది’ అన్నారు. ఎమోషనల్ లవ్‌స్టోరీగా ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నదని, ఈ సినిమా విషయంలో తమ అంచనాలు మొత్తం నిజమయ్యాయని నిర్మాత మదన్ గోపాల్ రెడ్డి చెప్పారు. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని నాయకానాయికలు అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.