Animal Movie | బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’(Animal). రష్మిక మంధాన (Rashmika Mandana) హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు మ్యూజికల్ అప్డేట్ ఇవ్వగా సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో చిత్రబృందం యానిమల్ ట్రైలర్‌ను విడుదల చేసింది.
ఈ ట్రైలర్ గమనిస్తే.. తండ్రీ కొడుకుల చుట్టూ తిరిగే కథ అని తెలుస్తుంది. చిన్నతనంలో తండ్రి ప్రేమకు దూరమై యానిమల్గా మారిన హీరో.. తర్వాత అదే తండ్రి కోసం మరింత రాక్షసంగా ఎలా మారాడు అనేది ట్రైలర్లో కనిపిస్తుంది.
ట్రైలర్ చూస్తుంటే.. రణ్‌బీర్ ఇంతకు ముందెన్నడూ కనిపించని మోస్ట్ వైలెంట్ రోల్లో కనిపించబోతున్నాడు.
Animal Trailer is here…🪓🔥#AnimalTrailer #AnimalOn1stDec #AnimalTheFilm #AnimalTrailerOutNowhttps://t.co/zDV8wx1OlF
Hindi 👆🏼https://t.co/3MemMHlcIG
Telugu 👆🏼https://t.co/uAfEpS3EF6
Tamil 👆🏼https://t.co/L4jzg1Gf7J
Kannada 👆🏼https://t.co/uqxtJUeUD5
Malayalam 👆🏼… pic.twitter.com/xeMCfobpBB— Animal The Film (@AnimalTheFilm) November 23, 2023