Animal Movie | బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘యానిమల్’(Animal). ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన (Rashmika Mandana) హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు మ్యూజికల్ అప్డేట్ ఇవ్వగా సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. యానిమల్ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. ముఖ్యంగా ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 21న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు ఫేక్ అని చెబుతూ ట్రైలర్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్రబృందం.
ఈ మూవీ ట్రైలర్‌ను నవంబర్ 23న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతూ.. ‘వేచి ఉండటం విలువైనది’. యానిమల్ ట్రైలర్ నవంబర్ 23న రాబోతుంది అంటూ మేకర్స్ తెలిపారు. దీనితో ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
Worth the wait 🙂 23-11-23 @AnimalTheFilm @VangaPictures @TSeries pic.twitter.com/pxfiVrMDw7
— Sandeep Reddy Vanga (@imvangasandeep) November 20, 2023
మరోవైపు ‘యానిమల్’ టీమ్ బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు వస్తున్న విషయం తెలిసిందే. రణ్‌బీర్ కపూర్, రష్మిక, సందీప్ రెడ్డి వంగా పాల్గొననున్న ఈ అన్‌స్టాపబుల్ పాన్ ఇండియా ఎపిసోడ్‌ను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో నవంబర్ 24న స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు.