తండ్రీకొడుకుల అనుబంధానికి దర్పణం
‘అర్జున్ రెడ్డి’ వినడానికి సాధారణ ప్రేమకథే. కానీ అందులో ఏదో తెలియని డైరెక్టోరియల్ మ్యాజిక్ జనాన్ని కట్టిపడేసింది. తెరపై ఓ కొత్త వాతావరణం, మునుపెన్నడూ వెండితెర ఎరుగని యాటిట్యూడ్స్ ఇవన్నీ సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్లో కనిపిస్తాయి.
‘అర్జున్ రెడ్డి’ వినడానికి సాధారణ ప్రేమకథే. కానీ అందులో ఏదో తెలియని డైరెక్టోరియల్ మ్యాజిక్ జనాన్ని కట్టిపడేసింది. తెరపై ఓ కొత్త వాతావరణం, మునుపెన్నడూ వెండితెర ఎరుగని యాటిట్యూడ్స్ ఇవన్నీ సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్లో కనిపిస్తాయి. ఆ ఫ్రెష్నెస్సే ‘యానిమల్’పై అంచనాలు పెంచేలా చేసింది. దానికి తగ్గట్టే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు కూడా అంచనాలను అంబరాలు తాకేలా చేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘అమ్మాయి..’ ‘నే వేరే..’ గీతాలు దేశవ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకున్నాయి. మంగళవారం మూడో పాటను మేకర్స్ విడుదల చేశారు.
‘నాన్న నువ్ నా ప్రాణం’ అంటూ సాగే ఈ పాట తండ్రీకొడుకుల అనుబంధానికి అద్దం పడుతూ సాగింది. దానికి తగ్గట్టే హీరో రణబీర్, అనిల్‌కపూర్ స్టిల్ కూడా మనసుల్ని హత్తుకునేలా ఉంది. తండ్రిగా అనిల్‌కపూర్, అతనికి ఆసరా అయి నడిపిస్తున్న కొడుకుగా రణ్బీర్కపూర్ని ఈ స్టిల్‌లో చూడొచ్చు. కథపై ఆసక్తిని పెంచేలా ఈ ఈ స్టిల్ ఉంది. సోనూనిగమ్ అద్భుతంగా ఆలపించిన ఈ పాట తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీడియోల్, త్రిప్తి దిమ్రీ కీలక పాత్రలు పోషించారు. భూషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా ఈ చిత్రానికి నిర్మాతలు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Baththa Out on Netflix | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన సినిమా!
Katrina Kaif | ‘బౌన్స్ బ్యాక్ అవ్వాలా? ఎందుకు?’.. ట్రోలింగ్‌కు కత్రినా కైఫ్ గట్టి సమాధానం!
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

