స్టార్ డమ్ రావడానికి ఒక్క విజయం చాలు. అలాంటి విజయం ’యానిమల్’తో అందుకుంది త్రిప్తి దిమ్రి. అంతకు ముందు కొన్ని సినిమాల్లో మెరిసినా రాని గుర్తింపు ‘యానిమల్’తో దక్కింది. ఇప్పుడు ఆమెకు వరుస అవకాశాలు లభిస్తున్నాయి.
బాలీవుడ్ హిట్ ఫ్రాంఛైజీ ‘ఆషికీ- 3’లో ఈ భామ కథానాయికగా ఎంపికైనట్లు తెలుస్తున్నది. ఇందులో కార్తిక్ ఆర్యన్ హీరో. దీంతో పాటు ఇంకొన్ని బాలీవుడ్ సినిమాలని అంగీకరించడానికి సిద్ధంగా ఉంది. తెలుగు నుంచి కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం
తన దృష్టి బాలీవుడ్ సినిమాలపైనే ఉందని త్రిప్తి దిమ్రి చెప్పింది.