AIRFORCE – Bezawada Batch | టాలీవుడ్లో కంటెంట్‌కు ప్రాధాన్యతనిస్తూ, వైవిధ్యమైన సినిమాలను నిర్మించే నిర్మాతగా పేరుపొందిన అనిల్ సుంకర, మరోసారి తన దాతృత్వాన్ని, విజన్‌ను చాటుకున్నారు. ఇప్పటికే ‘షో టైమ్ – సినిమా తీద్దాం రండి’ అనే రియాలిటీ షో ద్వారా క్రియేటివ్ కమ్యూనిటీలో ప్రకంపనలు సృష్టించిన ఆయన, ఇప్పుడు ఏటీవీ ఒరిజినల్స్ (ATV Originals) బ్యానర్‌పై సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా పెద్ద నిర్మాతలు స్టార్ హీరోల వెంట పడుతుంటారు, కానీ అనిల్ సుంకర మాత్రం “టాలెంట్ ఉన్నవారికి నా బ్యానర్ ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుంది” అని నిరూపిస్తూ, అందరూ కొత్త నటీనటులతో ‘ఎయిర్‌ఫోర్స్ – బెజవాడ బ్యాచ్’ (AIRFORCE – Bezawada Batch) అనే ఫీచర్ ఫిల్మ్‌ను ప్రకటించారు. నిరుద్యోగులైన నలుగురు యువకులు, విజయవాడ నేపథ్యంలో ఎదుర్కొన్న సవాళ్లు, వారి లక్ష్య సాధనలో పడ్డ కష్టాలను ఈ చిత్రం ప్రతిబింబించనుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చాలా కొత్తగా మొదలయ్యాయి. సాధారణంగా సోషల్ మీడియాలో పోస్టర్లు వేసే సంప్రదాయానికి భిన్నంగా, విజయవాడలోని ఒక ప్రముఖ జంక్షన్లో ఏర్పాటు చేసిన బ్యానర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. “అమెరికాకి వెళ్లి మా బెజవాడ బ్యాచ్‌ని ఖాళీగా తిరక్కండిరా, ఏదో ఒక పని చేసుకోమని సలహాలు ఇచ్చేంత స్థాయికి ఎదిగిన మా అర్జున్‌కు స్వదేశాగమన శుభాకాంక్షలు” అంటూ మట్టివాసన కలిగిన స్వచ్ఛమైన వెటకారంతో కూడిన ఈ బ్యానర్, సినిమాలో ఉండబోయే వినోదాన్ని ముందే పరిచయం చేసింది. ఈ చిత్రంలోని మొదటి కాస్ట్ మెంబర్‌ను ఇలా ట్రెండీగా పరిచయం చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. త్వరలోనే మిగిలిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు. కొత్త కలలకు ప్రాణం పోస్తూ అనిల్ సుంకర తీసుకున్న ఈ నిర్ణయంపై సినీ వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
The Journey Begins!🎬@AnilSunkara1‘s all-newcomers film
ATV Presents #AIRFORCE – Bezawada Batch has officially taken off with its first cast onboarding done in style!😎✈️
Here’s the Grandest Welcoming Update🤩Proudly on-boarding ARJUN,with love from all his beloved friends! pic.twitter.com/dhb3TuPbTw
— ATV Originals (@ATVOriginals) January 26, 2026