ఈ ఏడాది ‘మనశంకర వరప్రసాద్‌గారు’ చిత్రంతో సంక్రాంతి బరిలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ నేపథ్యంలో వెంకటేష్, కల్యాణ్‌రామ్‌లతో ఆయన తెరకెక్కించబోతున్న భారీ మల్టీస్టారర్‌పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఈ సినిమా నేడు లాంఛనంగా ప్రారంభంకానుంది. షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. నవంబర్‌లోగా చిత్రాన్ని పూర్తి చేసి తనకు బాగా కలిసొచ్చిన సంక్రాంతి సీజన్లోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు అనిల్ రావిపూడి.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘జనవరి 13 విడుదల’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సినిమా అనౌన్స్మెంట్ మొదలు ప్రచార కార్యక్రమాల వరకు ప్రతీ విషయంలో వినూత్నంగా ఆలోచించే అనిల్ రావిపూడి ఈ సినిమా టైటిల్ కూడా వెరైటీగా ఉండాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలో అదే టైటిల్ ఖరారు కావొచ్చని ప్రచారం జరుగుతున్నది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.