హాస్యనటుడు ప్రవీణ్ ప్రధానపాత్రలో రూపొందుతున్న హంగర్ కామెడీ ఎంటర్టైనర్ ‘బకాసుర రెస్టారెంట్’. వైవా హర్ష టైటిల్‌రోల్ పోషించారు. కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ కీలక పాత్రధారులు. ఎస్.జె.శివ దర్శకుడు. లక్ష్మయ్య ఆచారి, జానార్దన ఆచారి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ప్రచారంలో భాగంగా ఈ సినిమా టైటిల్ ర్యాప్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ పాటను లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: బాలసరస్వతి, సంగీతం: వికాస్ బడిస, నిర్మాణం: ఎస్.జె.మూవీస్.