Anil ravipudi | కోలీవుడ్ స్టార్ యాక్టర్ దళపతి విజయ్ (Thalapathy Vijay) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం జన నాయగన్ (Jana Nayagan). కార్తీ (ఖాకీ) ఫేం హెచ్ వినోథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జులై 23న విడుదల కానుండగా.. తెలుగులో ప్రజల నాయకుడు టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ చిత్రం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి రీమేక్‌గా వస్తుందంటూ వచ్చిన పుకార్లపై కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత వెంకట్ కే నారాయణ క్లారిటీ కూడా ఇచ్చాడు. తాము కేవలం భగవంత్ కేసరిని స్ఫూర్తిగా తీసుకున్నాం.. ఈ విషయాన్ని అనిల్ రావిపూడితో కూడా చర్చించాం. జననాయగన్ కొత్త సంఘర్షణలు, కొత్త ప్రపంచంలో సాగే పూర్తి కొత్త కథతో సాగుతుంది. ప్రేక్షకులకు బావోద్వేగపూరితంగా కనెక్ట్ అవుతూనే.. తప్పకుండా తాజా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందన్నాడు.
జననాయగన్ ప్రాజెక్టులో తన ప్రమేయంపై టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. జననాయగన్ టీం భగవంత్ కేసరి అధికారికంగా హక్కులను తీసుకుంది. అయితే వాళ్లు ఒరిజినల్ వెర్షన్‌లోని కేవలం కొన్ని సీక్వెన్స్‌లను మాత్రమే తీసుకున్నారు. సినిమా మొత్తం పూర్తిగా కొత్త స్టోరీతో ఉంటుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు జననాయగన్ క్రియేటివ్ మెథడ్‌లో తాను జోక్యం చేసుకోలేదని కూడా చెప్పాడు. మేకర్స్ తెలుగు హక్కులను సొంతం చేసుకున్న తర్వాత స్వతంత్రంగా కొత్త స్క్రిప్ట్‌ను అడాప్ట్ చేసుకున్నారన్నాడు అనిల్ రావిపూడి.
జన నాయగన్లో పూజా హెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మమితా బైజు కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్, కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.