వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకుడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకురానుంది. మాఫియా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్లో చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలో సీనియర్ కథానాయిక ఆండ్రియా జెర్మియా..జాస్మిన్ అనే పాత్రలో కనిపించనుంది.
కథాగమనంలోని మలుపులకు ఆమె క్యారెక్టర్ ప్రధాన కారణంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్లో ఆండ్రియా చేతిలో గన్ పట్టుకొని పవర్ఫుల్ లుక్లో కనిపిస్తున్నది. సినిమాలో ఆమె వేట ఎవరి కోసమన్నది ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. శ్రద్ధాశ్రీనాథ్, రుహానీ శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మణికందన్, సంగీతం:: సంతోష్ నారాయణ్, రచన-దర్శకత్వం: శైలేష్ కొలను.