Andhra King Taluka | యంగ్ హీరో రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నవంబర్ 27న విడుదలై మంచి ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోంది. రామ్ కెరీర్లో మరో హిట్‌గా నిలుస్తుందనే రేంజ్లో రిపోర్టులు వస్తున్నాయి. విడుదలైన 24 గంటల్లోనే బుక్ మై షోలో 77,000 టికెట్లకు పైగా అమ్ముడవడం సినిమాకు భారీ బూస్ట్ ఇచ్చింది. వీకెండ్ వరకు ఇదే వేగం కొనసాగనున్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే థియేటర్లలో సినిమా చూసిన ఫ్యాన్స్ ఒక ఆసక్తికరమైన విషయం గమనించారు. రామ్ పాడిన “Puppy Shame” పాట యూట్యూబ్‌లో లిరికల్ వీడియోగా రిలీజ్ అయి మంచి రిస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ థియేట్రికల్ వర్షన్లో ఆ పాట కనిపించకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
మొత్తం 2 గంటల 46 నిమిషాల నిడివి ఉన్న చిత్రంలో కథా ఫ్లో వేగాన్ని తగ్గిస్తుందని భావించిన మేకర్స్ ఆ పాటను తొలగించినట్లు సమాచారం. కాలేజ్ నేపథ్యంలో టీజింగ్ సాంగ్‌గా ఉండే “Puppy Shame” పాట యూట్యూబ్‌లో లిరికల్ వీడియోగా అందుబాటులో ఉన్నందున, థియేట్రికల్ ఫ్లోలో పెద్దగా అవసరం లేదని భావించి తీసేసి ఉంటారని భావిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు దర్శకుడు మహేష్ బాబు పి త్వరలో దీనిపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఓటీటీ వర్షన్లో ఈ పాటను చేర్చే అవకాశమున్నట్లు, లేకుంటే పూర్తి వీడియో రూపంలో వేరుగా రిలీజ్ చేసే అవకాశం కూడా ఉందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో రాజీవ్ కనకాల, రావు రమేష్, మురళి శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వివేక్–మెర్విన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే సంగీత ప్రియుల నుండి మంచి స్పందనను అందుకుంటున్నాయి. మొదటి వీకెండ్ కలెక్షన్లు ఎలా ఉంటాయో ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మొత్తం మీద, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఓపెనింగ్స్‌తోనే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. “Puppy Shame” పాట మిస్ కావడం ఫ్యాన్స్‌కు చిన్న నిరాశ కానీ, కథా పేస్‌ను కాపాడేందుకు తీసుకున్న నిర్ణయమేనని స్పష్టమవుతోంది.