యాంకర్ శ్రీముఖి ఆశలన్నీ ఆ ఒక్క సినిమాపైనే..!

Anchor Sreemukhi | బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి కి అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలిగా ఇండస్ట్రీకి వచ్చిన ఈమె.. పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత యాంకర్‌గా మారి బుల్లితెర రాములమ్మగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఫాలోయింగ్‌ను ఇలాగే మెయింటైన్ చేస్తూ.. వెండితెరపై సక్సెస్ కావాలని మ్యాక్సిమం ట్రై చేసింది. హీరోయిన్గా రెండు మూడు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దీంతో కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అయినా వెండితెరపై బిజీ కావాలని చూస్తుంది శ్రీముఖి.
బుల్లితెరపై వచ్చిన క్రేజ్‌తో మూడో సీజన్లో బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి 100 రోజుల పాటు రచ్చ చేసింది శ్రీముఖి. ఒకానొక సమయంలో టైటిల్ కొట్టింది శ్రీముఖినే అని అంతా అనుకున్నారు. చివరకు రన్నరఫ్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత వచ్చిన ఇమేజ్ బ్యాలెన్స్ చేసుకుంటుంది శ్రీముఖి. తన కెరీర్‌ను చక్కగా ప్లాన్ చేసుకుంటుంది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ వదిలేసుకుంది. చాలా సెలెక్టివ్‌గా షోలు కూడా చేస్తుంది. అన్నింటికంటే ముందు ఫోటోషూట్స్ విషయంలో రెచ్చిపోతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా అందాలను ఆరబోస్తుంది శ్రీముఖి. నిజానికి చాలా బిజీగా ఉన్న సమయంలోనే ఈమె బిగ్ బాస్‌కు వెళ్లింది. దానికి కారణం ఆమెకు కోటికి పైగానే పారితోషికం ఇచ్చారని అప్పట్లో వార్తలు బాగానే వినిపించాయి.
ఇదిలా ఉంటే ఈ మధ్య ఎక్కువగా సినిమాలపై ఫోకస్ చేస్తుంది శ్రీముఖి. ఇటీవలే ఈమె నటించిన క్రేజీ అంకుల్స్ సినిమా వచ్చింది. కానీ వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియదు. తనకు హీరోయిన్గా సెట్ అవ్వదని మెల్లమెల్లగా అర్థం చేసుకుంటుంది శ్రీముఖి. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయిపోతుంది. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ నితిన్ హీరోగా నటించిన మాస్ట్రో సినిమా పైనే ఉన్నాయి. సెప్టెంబర్ 17న డిస్నీ హాట్ స్టార్‌లో ఈ సినిమా నేరుగా విడుదలవుతుంది. ఇందులో కీలకమైన పాత్రలో నటించింది శ్రీముఖి. ట్రైలర్లో కూడా ఈమె పాత్రకు బాగానే ఇంపార్టెన్స్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. తన కెరీర్‌కు మాస్ట్రో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని గట్టిగా నమ్ముతుంది శ్రీముఖి. మరి ఈ నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Sai Dharam Tej: ఆపరేషన్ సక్సెస్.. 24 గంటలు అబ్జర్వేషన్లో…!
సాయి ధరమ్ తేజ్ సేఫ్.. ఇదిగో చిరంజీవి ఇచ్చిన సాక్ష్యం..
Babu Mohan : స్పోర్ట్స్ బైక్ విచ్చలవిడిగా నడపొద్దు.. ఆ కడుపు కోత నాకు తెలుసు: బాబు మోహన్
సహజనటి జయసుధకు ఏమైంది.. ఎందుకు ఇలా మారిపోయింది..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

