సాయి ధరమ్ తేజ్ సేఫ్.. ఇదిగో చిరంజీవి ఇచ్చిన సాక్ష్యం..

Sai dharam Tej Accident | యాక్సిడెంట్లో గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మూడు రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్కడే ఆయన్ను చూసేందుకు సినీ రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. మెగా ఫ్యామిలీని పరామర్శించి వెళ్లిపోతున్నారు. వైద్యులు కూడా సాయి ధరమ్ తేజ్‌కు ఎలాంటి ప్రమాదం లేదని.. ఆయన పూర్తిగా చికిత్సకు స్పందిస్తున్నాడని క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఎవరెన్ని చెబుతున్నా కూడా.. సాయిధరమ్ తేజ్ ఎలా ఉన్నాడని అభిమానులు కంగారు పడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన్ను అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎలాంటి విజువల్ విడుదల చేయలేదు. దీంతో తేజూ బాగున్నాడని ఎంతమంది చెప్తున్నా కూడా ఫ్యాన్స్ లోపల ఏదో తెలియని కంగారు అయితే ఉంది. అయితే ఈ రోజు చిరంజీవిని చూసిన తర్వాత మాత్రం అందరికీ క్లారిటీ వచ్చేసింది. చిరు చేసిన పని చూసి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సేఫ్ అని అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు.

ఇంతకీ మెగాస్టార్ ఏం చేసాడబ్బా అనుకుంటున్నారా..? ఏం లేదండీ.. సందీప్ కిషన్ హీరోగా నటించిన గల్లీ రౌడీ ( Gully Rowdy ) సినిమా సెప్టెంబర్ 17న విడుదల కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. దీన్ని రిలీజ్ చేసిందెవరో తెలుసా.. మెగాస్టార్ చిరంజీవి. ఈ ట్రైలర్ లాంఛ్ సందర్భంగా చిరు చాలా రిలాక్స్డ్గా కనిపించాడు. ఆయన మొహంలో ఎలాంటి కంగారు లేదు. చిరునవ్వుతో కనిపించాడు. మొన్న సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ జరిగిన రోజు చిరు మొహంలో ఏదో తెలియని కంగారు కనిపించింది. అంతేకాదు మెగా ఫ్యామిలీ మొత్తం టెన్షన్ పడుతూ కనిపించింది. కానీ ఇవాళ చిరంజీవి మొహంలో ఆ టెన్షన్ లేదు. మేనల్లుడికి ఏం కాదనే భరోసా చిరంజీవి కళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు ట్రైలర్ లాంఛ్‌లో అందర్నీ నవ్వుతూ పలకరించాడు చిరంజీవి.
సందీప్ కిషన్ కూడా నవ్వుతూనే కనిపించాడు. మొన్న హాస్పిటల్‌కు వచ్చినపుడు సందీప్ కూడా కంగారు పడుతూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు అంతా కూల్ అయిపోయారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం మరింత కుదుట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఒక్క సాక్ష్యంతో మెగా అభిమానులు హాయిగా గుండెలపై చేతులేసుకుని నిద్ర పోతున్నారు. ఇక త్వరలోనే సాయి ధరమ్ తేజ్ కూడా బయటికి వచ్చేస్తాడు.. తన సినిమాలు తాను చేసుకుంటాడని సంతోషపడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
ఇవి కూడా చదవండి..
Sai Dharam Tej: ఆపరేషన్ సక్సెస్.. 24 గంటలు అబ్జర్వేషన్లో…!
Babu Mohan : స్పోర్ట్స్ బైక్ విచ్చలవిడిగా నడపొద్దు.. ఆ కడుపు కోత నాకు తెలుసు: బాబు మోహన్
సాయి తేజ్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రాసే వారికి హరీష్ శంకర్ పంచ్
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం కోసం పూజలు చేస్తున్న ఆ ఆశ్రమ వాసులు..
సాయి ధరమ్ తేజ్ సేఫ్.. ఇదిగో చిరంజీవి ఇచ్చిన సాక్ష్యం..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

