Anchor Sravanthi chokkarapu | బిగ్ బాస్ ఫేమ్, టెలివిజన్ యాంకర్ స్రవంతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో తన యాంకరింగ్‌తో అందరిని కట్టిపడేస్తుంది ఈ భామ. అయితే స్రవంతి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నానని.. 40 రోజులుగా విపరీతమైన బ్లీడింగ్‌తో నరకం చూస్తున్నాను అని సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. ముఖ్యంగా ఈ పోస్ట్ ఆడవారికోసం అంటూ తెలిపింది.
ఇంతకీ స్రవంతి ఏమని పోస్ట్ చేసిందంటే.. అస్సలు ఇలాంటి పోస్ట్ పెడతాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు పెట్టక తప్పట్లేదు. కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ పోస్ట్ పెడుతున్న ముఖ్యంగా ఈ పోస్ట్ ఆడవారికోసం అంటూ తెలిపింది. గత 35 – 40 రోజుల నుంచి నాకు విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది. రకరకాల మెడిసిన్స్ వాడాను. అయితే ఈ విషయంలో డాక్టర్ ని కలిసే టైంలేక స్కానింగ్ చేయించుకోలేదు. ఒకరోజు షూట్ మార్నింగ్ 6:45 నుండి తర్వాతి రోజు ఉదయం 2.45 వరకు జరిగింది. ఆ సమయంలోనే విపరీతమైన కడుపునొప్పి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్లాను. అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదు అని.. వెంటనే ఆసుపత్రిలో జాయిన్ అయ్యి సర్జరీ కి వెళ్లాల్సి వచ్చింది. ఇంకా నేను కంప్లీట్‌గా రికవర్ అవ్వడానికి 5 వారాలు అయిన పడుతుంది.
నేను ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.. ఇంతకుముందే నేను కొన్ని షూట్స్ కోసం డేట్స్ ఇచ్చేసాను. మళ్ళీ హెల్త్ బాలేదు అని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అని అడగకుండా ఉండకండి. అలా ఉన్నందుకే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి. ఇవన్నీ ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి అంటూ స్రవంతి రాసుకోచ్చింది.