Anasuya Bharadwaj | బుల్లితెర యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ అటు నటిగా, ఇటు యాంకర్‌గా తీరిక లేకుండా గడుపుతుంది. అయితే ఈమె కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటుంది. టాలీవుడ్ మోస్ట్ పాప్యులర్ కామెడీ షో అయినా జబర్ధస్త్‌తో ఈమెకు గుర్తింపు వచ్చింది. అయితే ఈ షోలో అనసూయ ధరించే దుస్తులపై నెటీజన్లు ట్రోలింగ్స్ చేస్తూ ఉంటారు. అమె కూడా నెటీజన్లుగా ధీటుగా సమాధానాలు ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ నెటీజన్ చేసిన కామెంట్‌పై అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది.
గతంలో అనసూయ పొట్టి గౌను ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే దీనిపై గతంలోనే ఓ నెటీజన్ ‘అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి.. ఇంకా ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా.. తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు’ అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌పై తాజాగా అనసూయ స్పందించి ‘దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు’ అంటూ అనసూయ ఘాటు రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.
అనసూయ ఇటీవలే ‘ఖిలాడీ’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె కీలక పాత్రలో నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో పాటుగా గోపిచంద్ ‘పక్కా కమర్షియల్’, కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలలో నటిస్తుంది.
దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు 🙏🏻🙂 https://t.co/Uy4P00bmAE
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 4, 2022
Anasuya Bharadwaj | అనసూయ భరధ్వాజ్ న్యూ లుక్స్ అదుర్స్..