Anasuya Bharadwaj | సినీనటి, యాంకర్ అనసూయ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెగ బిజీగా గడుపుతుంది. మంచి స్కోప్ ఉన్న రోల్స్ ఎంచుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతుంది. ఇక అనసూయ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెట్టడం.. వాటికి పలువురు నెగెటివ్‌గా స్పందించడం.. వాళ్లకు తన స్టైల్లో రిప్లైలు ఇవ్వడం ఇదంతా తరచూ జరిగే తతంగమే. అయితే తాజాగా అనసూయ చేసిన పోస్ట్ అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. బోరును విలపిస్తూ ఇన్‌స్టాలో అనసూయ ఓ వీడియో పెట్టింది. దాని కింద ఓ ఎమోషనల్ నోట్‌ను కూడా జత చేసింది.
అందరూ ఆరోగ్యంతో, ఉత్సాహంతో ఉన్నారని ఆశిస్తున్నాను. నా పోస్ట్ చూసి మీరందరూ గందరగోళంగా ఉన్నారని తెలుసు. నాకు తెలిసనంతవరకు సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ అనేవి సమాచార విషయాలని పంచుకునేందుకు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఒకరితో ఒకరు కనెక్ట్ అవడానికి, ఆనందాన్ని పంచుకోవడానికి, జీవన శైలిలలు, సంస్కృతులను షేర్ చేసుకోవడానికి ఇలా పలు విషయాలకు సంబంధించిన సమాచారం కోసమే సోషల్ మీడియాల ఉంది. అయితే నిజంగా అదే జరుగుతోందా?
ఈ పోస్ట్ ఉద్దేశ్యం ఏంటంటే అన్ని ఫోటో షూట్లు, పోజులు, స్మైల్స్, డాన్సులు, బలమైన కౌంటర్లు ఇలా అన్నీ నా జీవితంలో భాగమే. మీరు కూడా అలానే ఉన్నారు. కాబట్టి నేను అదంతా మీతో పంచుకుంటాను. ఇలాగే నా జీవితంలో కొన్ని దశలో అంత బలంగా లేను, చాలా వీక్గానూ ఉన్నాను. విచ్చిన్నాలున్నాయి. ఆ విషయాలను మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నా. ప్రపంచంలో ఎంతటి వారైనా, మామూలు వ్యక్తులైనా అందరికి బాధలు, కష్టాలుంటాయి. జీవితంలో అవి రెండు అందరికి కామనే. కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. బాధని వ్యక్తం చేసేలా గట్టిగా ఏడ్వడంలో తప్పులేదు. బాగా ఏడ్చి, ఆ బాధనంతా బయటకు పంపేసి తిరిగి మళ్లీ మామూలు స్థితికి రావాలి. మళ్లీ స్ట్రాంగ్‌గా కమ్ బ్యాక్ ఇవ్వాలి. బాధని వదిలేసేందుకు ఏడ్వడంలో తప్పులేదు. అదే సమయంలో బాధలు, కన్నీళ్లు ఉన్నాయని అధైర్యపడవద్దని అనసూయ వెల్లడించింది.
కష్టాలు అందరికి ఉంటాయి. అవి ఉన్నప్పుడు రెండు మూడు రోజులు బాగా ఏడ్చి మళ్లీ మామూలు జీవితాన్ని ప్రారంభించాలి. ఎప్పుడూ సవాళ్ల నుంచి భయపడి దూరం పోవద్దు. తిరిగి మరింత బలంగా కమ్‌బ్యాక్ కావాలని కోరుకుంటున్నా అంటూ ఆ వీడియోలో వెల్లడించింది. దీనిపై పలువురు లైఫ్ గురించి చెప్పడానికి అంతలా ఏడవాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.