బాలీవుడ్ (Bollywood) నటుడు షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) డ్రగ్స్ కేసులో అరెస్టై జైలులో ఉన్న సంగతి తెలిసిందే. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపుతూ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆర్యన్‌ఖాన్ బెయిల్ అభ్యర్థన పెట్టుకున్నప్పటికీ పలు సార్లు తిరస్కరణకు గురైంది. షారుక్‌ఖాన్ ఇంటి (మన్నత్)కి వెళ్లి తనిఖీలు కూడా నిర్వహించారు.
ఇదిలా ఉంటే మరోవైపు బాలీవుడ్ నటి అనన్యపాండే (Ananya Panday)కు కూడా ఇవాళ ఎన్సీబీ సమన్లు జారీచేసింది. ఎన్సీబీ బృందం (Narcotics Control Bureau) ముంబైలోని అనన్యపాండే నివాసానికి వెళ్లి సమన్లు అందజేసింది. అనన్యపాండేను ఎన్సీబీ విచారించనుంది. ప్రముఖ నటుడు చుంకీపాండే కూతురైన అనన్యపాండే పలు హిందీ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో లైగర్ సినిమా చేస్తోంది. ఓ వైపు ఆర్యన్‌ఖాన్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ఎన్సీబీ ఇపుడు అనన్యపాండేకు సమన్లు అందిచండం చర్చనీయాంశంగా మారింది.
ఆర్యన్ కేసుతో అనన్యపాండేకు ఏమైనా లింక్ ఉందా..? అంటూ వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఆర్యన్‌ఖాన్ బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. అక్టోబర్ 26 ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha: నాగచైతన్య కోసం సమంత ఇన్ని త్యాగాలు చేసిందా?
Samantha | హీరో కోసం చూస్తున్న సమంత..!
samantha | కండీషన్స్ పెడుతున్న సమంత.. వాటికి ఓకే అంటేనే సినిమాకు సై..
Preetham: ఆగని మాటల దాడి.. చైతూ స్పందించాలని కోరుతున్న సమంత స్టైలిస్ట్