Anandam: ఆనందం చిత్రానికి 20 ఏళ్లు.. ప్రేమకథగా ఎంతగానో అలరించిన చిత్రం

ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై శ్రీను వైట్ల దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ఆనందం చిత్రం ఎంత పెద్ద హిట్టైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆకశ్ హీరోగా ఈ చిత్రం రూపొందగా, ఈ చిత్రంలో ఆకాశ్ సరసన రేఖ, వెంకట్ జోడీగా తనూ రాయ్ నటించారు. చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, ధర్మవరపు, బ్రహ్మానందం, చిత్రం శ్రీను, శివారెడ్డి, సుధ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, బెనర్జీ, జెన్నీ ఇతర పాత్రల్లో కనిపించారు.
2001 సెప్టెంబర్ 28న విడుదలై యువతను ఎంతగానో ఆకర్షించిన ‘ఆనందం’ చిత్రం నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. చక్కని ప్రేమ కథాగా ఈ మూవీ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. . ‘ఆనందం’తో శ్రీను వైట్ల దర్శకునిగా మంచి మార్కులు సంపాదించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇది దేవిశ్రీ కి మూడో సినిమా కావడం విశేషం. ఇందులో సీతారామశాస్త్రి రాసిన పాటలు శ్రోతలని ఎంతగానో అలరించాయి.
ఆనందం చిత్రం పలు భాషలలోను రీమేక్ అయింది. ఉషాకిరణ్ మూవీస్ ఈ సినిమాను తమిళంలో ‘ఇనిదు ఇనిదు కాదల్ ఇనిదు’ పేరుతోనూ, కన్నడలో ‘ఆనంద’ పేరుతోనూ రీమేక్ చేసింది. ఈ చిత్రం తరువాత శ్రీను వైట్ల దర్శకత్వంలోనే ఆకాశ్ హీరోగా ‘ఆనందమానందమాయె’ అనే మరో చిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ నిర్మించింది. ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. అయితే ఆకాశ్ దర్శకత్వంలో ‘ఆనందం’కు సీక్వెల్ గా ‘ఆనందం ఆరంభం’ అనే చిత్రం రూపొందించారు. ఈ సినిమా ఏమైందో ఇప్పటికీ తెలియరాలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- 20 years
- aakash puri
- anandam
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

