Production No. 32 | గతేడాది బేబి (Baby) సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) మరో సినిమాను ప్రారంభించాడు. ‘నైంటీస్’. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్(#90’s – A Middle Class Biopic) అనే వెబ్ సిరీస్‌తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్‌తో కలిసి కొత్త సినిమాను ప్రారభించాడు. ఈ సినిమాలో బేబి జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మళ్లీ కలిసి నటించబోతున్నారు. తాజాగా ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభంమయ్యింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్లాప్ కొట్టగా.. నటుడు శివాజీ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. దర్శకుడు వెంకీ అట్లూరి ఆదిత్య హాసన్‌కి కథను అందించాడు.
ప్రోడక్షన్ నెం 32 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్లో రానుండగా.. ‘నైంటీస్’. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ కొనసాగింపుగా ఈ సినిమా రాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనౌన్స్మెంట్ వీడియోను కూడా చిత్రయూనిట్ వదిలింది. టాలీవుడ్ నటుడు శివాజీ (Shivaji), వాసంతిక కీలక పాత్రలో నటిస్తున్నారు. సితార ఎంటర్టైనమెంట్స్, ఫోర్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.
And it begins for the MOST RELATABLE LOVE STORY 😍@SitharaEnts Production No. 32 takes off with a pooja ceremony full of love ❤️
&
Regular shoot commences this June 🫶🏻Clap by @iamRashmika
Camera Switch On by @ActorSivaji
Script handover by #VenkyAtluri & @kalyanshankar23… pic.twitter.com/POVPgdqhco— Sithara Entertainments (@SitharaEnts) May 15, 2025