Baby Movie Actors Remunerations | బేబీ వచ్చి వారం దాటినా ఇంకా అదే మత్తులో యూత్ ఊగిపోతున్నారు. కల్ట్ బొమ్మ అంటూ రివ్వూలు ఇచ్చేస్తున్నారు. ఓ వైపు జోరుగా వానలు పడుతున్నా.. మరో వైపు బేబితో హాల్స్ నిండుగా కనిపిస్తున్నాయి. అసలు స్టార్ కాస్ట్ లేదు. పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడక్షన్ సంస్థ అంత కన్నా కాదు. కేవలం కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీశారు. ఇప్పుడా నమ్మకమే కోట్లు కుమ్మరిస్తుంది. హిట్ నుంచి డబుల్, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ దిశగా బేబి సినిమా పరుగులు పెడుతుంది. వారం రోజుల్లోనే రూ.49 కోట్లు కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా శుక్రవారంతో రూ.50 కోట్ల క్లబ్‌లోకి అడుగపెట్టనుంది. ఈ మధ్య పేరున్న సినిమాలే రూ.50 కోట్ల మార్కును టచ్ చేయాలంటే కష్టపడుతుంటే.. బేబి ఇంత తక్కువ టైమ్‌లో ఈ ఫీట్ సాధించడం గొప్ప విషయమే.
ఇప్పటికే చిత్రయూనిట్‌కు దాదాపుగా పెట్టిన దానికి రెండు రేట్లు లాభాలు వచ్చేశాయి. గ్రాస్ లెక్కలు చూసుకుంటే ఈ సినిమాకు ఇప్పటివరకు వచ్చిన షేర్ రూ.30 కోట్లు. సినిమాకయిన బడ్జెట్ రూ.8 కోట్లు. ప్రమోషన్స్ ఖర్చు ఓ రెండేసుకంటే మొత్తంగా పది కోట్లు. ఈ లెక్కన నిర్మాతలకు ఇప్పటికే రూ.20కోట్ల రేంజ్లో ప్రాఫిట్స్ వచ్చాయి. అయితే ఈ స్థాయిలో లాభాలందుకున్న నిర్మాతలు.. బేబిలో నటించిన వారికి ఎంతిచ్చుంటారనే ప్రశ్న ఇప్పుడు చాలా మంది మదిలో మెదులుతుంది. కాగా ఈ సినిమా కోసం బేబి కాస్ట్ అందుకున్న పారితోషికం తక్కువే అని తెలుస్తుంది.
బేబి సినిమా హీరో ఆనంద్ దేవరకొండ ఈ సినిమా కోసం 70లక్షల రేంజ్లో పారితోషికం అందుకున్నాడట. ఇక హీరోయిన్ వైష్ణవి చైతన్య రూ.30 నుంచి 40 లక్షల రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. విరాజ్ పాతికలక్షల వరకు తీసుకున్నాడట. మొత్తం కాస్ట్ ఖర్చంతా లెక్కేస్తే కోటిన్నర లోపే అట. కాగా దర్శకుడు సాయి రాజేష్ మాత్రం కోటికి పైగా తీసుకున్నాడట. అయితే ప్రొడక్షన్ ఖర్చు ఎక్కువైందని తెలుస్తుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడుకుండా సినిమానూ రూపొందించారట.