నా కెరీర్లో ప్రత్యేకం
గం గం గణేశా’ నా కెరీర్లో సరికొత్త ప్రయత్నం. ఈ సినిమాలో నేను పక్కింటి అబ్బాయిలా కనిపించను. హైపర్ ఎనర్జీతో నా క్యారెక్టర్ సాగుతుంది. క్రైమ్ కామెడీ కథాంశంతో ఆకట్టుకుంటుంది’ అన్నారు ఆనంద్ దేవరకొండ
“గం గం గణేశా’ నా కెరీర్లో సరికొత్త ప్రయత్నం. ఈ సినిమాలో నేను పక్కింటి అబ్బాయిలా కనిపించను. హైపర్ ఎనర్జీతో నా క్యారెక్టర్ సాగుతుంది. క్రైమ్ కామెడీ కథాంశంతో ఆకట్టుకుంటుంది’ అన్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఉదయ్‌శెట్టి దర్శకుడు. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం ఆనంద్ దేవరకొండ పాత్రికేయులతో పంచుకున్న సంగతులు..
- వినాయకుడి విగ్రహం చుట్టూ నడిచే కథ ఇది. ఆ విగ్రహాన్ని దక్కించుకోవడం కోసం కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. అసలు ఆ విగ్రహంలో ఏముంది? చివరకు అది ఎవరికి దక్కింది? అనే విషయాలు ఈ కథలో ఆసక్తినిరేకెత్తిస్తాయి. భయం, అత్యాశ, కుట్ర అనే మూడు అంశాల చుట్టూ నడిచే ఈ కథ ఆద్యంతం ఉత్కంఠను, వినోదాన్ని పంచుతుంది
- లాక్డౌన్ టైమ్‌లో దర్శకుడు ఉదయ్‌శెట్టి ఈ కథ చెప్పాడు. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. చాలా మంది నన్ను హీరో సెంట్రిక్ మూవీస్ ఎందుకు చేయడం లేదని అడుగుతుంటారు. ఈ సినిమాతో కొంత వరకు ఆ ప్రయత్నం నెరవేరింది. ఇందులో నా పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా అనిపిస్తుంది.
- ఏ హీరోకైనా స్పాన్ ఒక్కసారిగా పెరిగేది కాదు. ‘బేబీ’ వంద కోట్లు వసూలు చేసిందని నా తదుపరి చిత్రానికి ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రావాలని అనుకోను. ఎందుకంటే ‘బేబీ’ యూనివర్సల్ లవ్ సబ్జెక్ట్ కాబట్టి ఆ స్థాయిలో వసూళ్లు సాధించింది. ‘గం గం గణేశా’ క్రైమ్ కామెడీ జోనర్. అందుకే రెండు చిత్రాలను పోల్చి చూడటం లేదు.
- రష్మిక మందన్న మా ఫ్యామిలీ ఫ్రెండ్. ప్రీరిలీజ్ ఫంక్షన్లో చిట్‌చాట్ వైరల్ కావాలనే చేశాం. నాకు పక్కా మాస్ యాక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. త్వరలో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలో అలాంటి కథతో సినిమా చేయబోతున్నా. వినోద్ దర్శకుడు. ‘బేబీ’ డైరెక్టర్ సాయిరాజేష్, నిర్మాత ఎస్కేఎన్ కాంబినేషన్లో ఓ సినిమా చేయబోతున్నా. స్టూడియో గ్రీన్ వారి ‘డ్యూయట్’ సినిమాలో నటిస్తున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
Burns crop | నీళ్లు లేక కరెంట్ రాక.. సూర్యాపేట జిల్లాలో పంటను కాలబెట్టిన కౌలు రైతు
AP News | తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

