విక్రమ్ సహిదేవ్, సంధ్య విశిష్ట జంటగా నటిస్తున్న రా అండ్ రస్టిక్ థ్రిల్లర్ ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకుడు. కండ్రేగుల నాయుడుతో కలిసి ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల కానున్నది. తాజాగా ఈ సినిమా నుంచి ‘లబ్బరు బొమ్మ’ అంటూ సాగే ఓ మాస్ గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. రాంబాబు గోశాల రాసిన ఈ పాటను దేవ్జండ్ స్వరపరచగా, శ్రీకృష్ణ, సాహితీ చాగంటి కలిసి ఆలపించారు. తారక్ పొన్నప్ప, నందినీరాయ్లపై ఈ పాటను చిత్రీకరించారు. మాస్ ఆడియన్స్కి నచ్చేలా ఈ పాటను దర్శకుడు ఖగేష్ తమ్మినేని తెరకెక్కించారు. ఈ చిత్రానికి కథ, కథనం: నక్కిన త్రినాథరావు, కెమెరా: మాయా.వి, నిర్మాణం: భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్.