బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్‌బచ్చన్ ‘ప్రాజెక్ట్-కె’ సినిమా షూటింగ్లో గాయపడ్డారు. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా పక్కటెముకలకు బలమైన దెబ్బ తగిలిందని ఆయన తన వ్యక్తిగత బ్లాగ్ ద్వారా తెలియజేశారు. ఈ నేపథ్యంలో తన సినిమా షూటింగ్స్ మొత్తం వాయిదా వేసుకుంటున్నానని అమితాబ్‌బచ్చన్ పేర్కొన్నారు. ‘హైదరాబాద్ షెడ్యూల్లో నాకు గాయాలయ్యాయి. అక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా. శ్వాస పీల్చే సందర్భంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని వారాల విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుందని వైద్యులు సూచించారు. ప్రస్తుతం ముంబయిలోని నా స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నా’ అని అమితాబ్‌బచ్చన్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్-కె’ చిత్రం తెరకెక్కుతున్నది. సూపర్‌హీరో కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అమితాబ్‌బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్నది.