బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఏడు పదుల వయస్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు కౌన్ బనేగా కరోడ్ పతి షోని కూడా హోస్ట్ చేస్తున్నాడు. తాజాగా నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్ చేశారు. అయితే కాలికి గాయం అయిన కూడా అలానే షూటింగ్లో పాల్గొన్నట్టు బిగ్ బీ తెలియజేశారు.
కాలి వేలు విరిగింది. నొప్పితీవ్రంగా ఉంది. విరిగిన వేలుని వేరొక వేలితో కలిపి కట్టడం వలన నాలుగు లేదా ఐదు వారాలలో తగ్గే అవకాశం ఉంది. నొప్పిని ప్లాస్టర్‌తో కప్పి ఉంచలేం అంటూ అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో తెలియజేశారు. అయితే షోలో తన కాలి వేలు కనిపించకుండా డిఫరెంట్ షూస్ ధరించాడు. గాయం అయిన కూడా కేబీసీ షూటింగ్‌ని తాను ఎంజాయ్ చేసినట్టు పేర్కొన్నాడు. ప్రస్తుతం అమితాబ్ .. ఇమ్రాన్ హష్మీతో కలిసి ‘చెహ్రే’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ అనే సినిమా చేస్తున్నాడు. ‘బ్రహ్మస్త్ర’, ప్రాజెక్ట్ కె, గుడ్‌బాయ్ వంటి సినిమాలలో కూడా నటిస్తున్నారు.