‘అమీర్‌లోగ్’ చిత్రంలో తాను పోషించిన పాత్ర మహిళలకు స్ఫూర్తినిచ్చేలా ఉంటుందని చెప్పింది కథానాయిక వేదా జలంధర్. హైదరాబాద్ బస్తీ నేపథ్య కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ నెల 21న రానా ‘స్పిరిట్’ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర కథానాయిక వేదా జలంధర్ పాత్రికేయులతో ముచ్చటించింది.
ఈ సినిమాలో తాను పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో కనిపిస్తానని, ముక్కసూటిగా మాట్లాడటం తన నైజమని చెప్పింది. ‘ఈ సినిమా రిలీజైన తర్వాత ప్రతీ ఒక్కరూ నా పాత్ర గురించి మాట్లాడుతారు. హైదరాబాద్ నేటివిటీని ప్రతిబింబించే అద్భుతమైన కథ ఇది. ప్రతీ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆరేళ్లయింది. ‘అమీర్‌లోగ్’ తప్పకుండా నా కెరీర్‌కు బ్రేక్‌నిస్తుందనే నమ్మకం ఉంది’ అని వేదా జలంధర్ తెలిపింది.