జొరమ్
అమెజాన్ ప్రైమ్
తారాగణం: మనోజ్ బాజ్‌పాయ్, స్మిత తాంబే, జీషన్ అయూబ్ తదితరులు
దర్శకత్వం: దేబాశిష్ మఖీజా
OTT | మనోజ్ బాజ్‌పాయ్ నటించిన విలక్షణ చిత్రం ‘జొరమ్’ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందన్న ప్రేక్షకుల ఎదురుచూపులకు తెరపడింది. గతేడాది డిసెంబర్ 8న థియేటర్లో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో అద్దెకు చూడొచ్చు. సిడ్నీ, డర్బన్, చికాగో లాంటి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన ‘జొరమ్’ ఇంట విడుదల కాకముందే రచ్చ గెలిచింది. ఫిలింఫేర్ అవార్డ్స్-2024లో ఉత్తమ చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది.
జార్ఖండ్ అడవుల్లో నివసించే దస్రు, వానో అనే గిరిజన జంటకు జొరమ్ అనే మూడు నెలల కూతురు ఉంటుంది. బతుకుదెరువు కోసం దస్రు భార్యాబిడ్డతో ముంబయికి వస్తాడు. భార్యాభర్తలిద్దరూ భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తుంటారు.
వీరి జీవితంలోకి ఓ రాజకీయ నాయకురాలు ప్రవేశిస్తుంది. తన కొడుకును దస్రు చంపాడని అతని కుటుంబాన్ని మట్టుపెట్టాలని చూస్తుంది. వానోను చంపేయడంతో కూతురుతో కలిసి దస్రు ముంబయి నుంచి పారిపోతాడు. పోలీసులకు చిక్కకుండా సొంతూరుకు పయనమవుతాడు. పోలీసుల ఉచ్చు నుంచి దస్రు తప్పించుకున్నాడా? సొంతూరికి చేరుకున్నాడా? చివరికి ఏమైందన్నది మిగిలిన కథ! ఇప్పటికైతే ఈ సినిమా చూడాలంటే రూ.199 అద్దె చెల్లించాల్సిందే!