Amardeep | బుల్లితెరపై ప్రేక్షకులకి మంచి వినోదం పంచే నటులలో అమర్ దీప్ చౌదరి ఒకరు. బిగ్ బాస్ సీజన్ 7లో కూడా పాల్గొని సందడి చేశాడు. ఆయన తేజశ్విని గౌడని ప్రేమ వివాహం చేసుకోగా, ఈ జంట భలే క్యూట్‌గా అనిపిస్తారు. సీరియల్స్ ద్వారా పెరిగిన వీరి పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుని ప్రస్తుతం వైవాహిక జీవితంలో సంతోషంగానే ఉన్నారు. అయితే అమర్ బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు అతనికి కోసం తేజశ్విని పెద్ద యుద్ధమే చేసింది. సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్ బిగ్ బాస్ షోలో పాల్గొని తన ఫేమ్ ను మరింత పెంచుకున్నాడు.
ఇప్పుడు హీరోగా తనను నిరూపించుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘చౌదరి గారి అబ్బాయి – నాయుడు గారి అమ్మాయి’. ఈ సినిమాలో సీనియర్ నటి సురేఖా వాణి కుమార్తె సుప్రీత హీరోయిన్గా నటిస్తోంది. సోషల్ మీడియాలో సుప్రీతకి ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో అమర్ దీప్, సుప్రీత మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇటీవల అమర్ దీప్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ఆసక్తికరంగా షేర్ చేసుకున్నారు. సుప్రీత నాకు ఇప్పుడు మంచి ఫ్రెండ్. ఇద్దరం వర్క్ విషయంలో చాలా విషయాల్లో చర్చించుకుంటాం, సజెషన్స్ ఇచ్చుకుంటాం.
షూటింగ్ సమయంలో బాగా క్లోజ్ అయ్యాం. అప్పుడప్పుడూ స్క్రిప్ట్ డిస్కషన్స్ కోసం సిట్టింగ్స్ కూడా చేస్తుంటాం. ఒకసారి నేను నా ఫ్రెండ్స్ తో, సుప్రీత తన ఫ్రెండ్స్ తో గోవాకు సపరేట్ గా వెళ్లాం. అయితే అక్కడ అనుకోకుండా కలిసాం. ఆ రాత్రి నేను తాగి పడిపోతే, సుప్రీత తెల్లారి 9 గంటలకు నన్ను నా రూమ్ దగ్గర డ్రాప్ చేసింది. ఆమె అమ్మ సురేఖావాణి అక్క కూడా నాకు బాగా అప్రోచ్ బుల్. కేర్ తీసుకుంటారు. వాళ్లతో ఉన్న అనుబంధం విషయంలో హ్యాపీగా ఫీలవుతున్నాను అని అన్నారు. ఈ మాటల ద్వారా అమర్ దీప్ – సుప్రీత మధ్య ఉన్న కెమిస్ట్రీ, స్నేహం ఎంత బలంగా ఉంది అనే విషయం స్పష్టమవుతోంది.