ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది కథానాయిక అమలాపాల్. ప్రస్తుతం తమిళం, మలయాళ భాషలపై దృష్టిపెట్టిన ఈ సొగసరి త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నదని తెలిసింది. గతంలో తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ను ప్రేమించి పెళ్లాడిందీ భామ. మూడేళ్లకే మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమె జగత్ దేశాయ్ అనే వ్యాపారవేత్తతో ప్రేమాయణాన్ని సాగిస్తున్నది. త్వరలో అతనితో కలిసి ఏడడుగులు వేయబోతున్నదని తెలిసింది.
తాజాగా ఈ అమ్మడి పుట్టిన రోజు వేడుకలను ఓ రిసార్ట్‌లో ఘనంగా సెలబ్రేట్ చేశాడు జగత్దేశాయ్. ఈ సందర్భంగా ఉంగరం బహూకరించి అమలాపాల్‌కు పెళ్లి ప్రపోజ్ చేశాడు. అందుకు సమ్మతించిన అమలాపాల్ ప్రియుడికి ఆప్యాయంగా ఓ ముద్దిచ్చింది. ఈ వీడియోను జగత్దేశాయ్ తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా పంచుకోగా అది కాస్త వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ జంట త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అమలాపాల్ ప్రస్తుతం ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నది.