Alluri Movie | హై యాక్షన్ సీన్స్‌తో ‘అల్లూరి’ ట్రైలర్.. పోలీస్ పాత్రలో అదరగొట్టిన శ్రీవిష్ణు
Alluri Movie Trailer | ఫలితంతో సంబంధంలేకుండా శీవిష్ణు వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం శ్రీవిష్ణు నటించిన 'అల్లూరి' విడుదలకు సిద్ధంగా ఉంది.
Alluri Movie Trailer | వాస్తవికతను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచుకుంటూ సినీరంగంలో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధంలేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు కొత్త కథలను పరిచయం చేయడంలో శ్రీ విష్ణూ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఇటీవలే ఈయన నటించిన ‘భళా తందనాన’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం శ్రీవిష్ణు నటించిన ‘అల్లూరి’ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘జీవితంలో ఏదైనా సాధించాలనుకున్న వాళ్ళు ఓ లక్ష్యం పెట్టుకుంటారు. లక్ష్యం పెట్టుకోవడం పెద్ద గొప్ప కాదు. లక్ష్యం సాధించడం కూడా పెద్ద గొప్పేం కాదు. కానీ ఆ లక్ష్యం కోసం జరిపే పోరాటముంది చూశావా అది అద్భుతం’ అంటూ తనికెళ్ళ భరణి డైలాగ్‌తో ట్రైలర్ మొదలయింది. ‘గవర్న్మెంట్లే ఐదేళ్ళకొకసారి మారుతాయి. ఆ గవర్నమెంట్లో ఉన్న మీరు మారరా? మారతారు. మారనని మొండికేస్తే మేము మార్చాల్సి వస్తుంద’. ‘పోలీస్ అంటే ఒక వ్యక్తి కాదు సర్. పోలీస్ అంటే ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే ఆ ప్లేస్‌లో మరో పోలీస్ ఆఫిసర్ వస్తాడు. కానీ మనం చేసే ఈ ఆపరేషన్ తర్వాత మినిమి 40మంది పిల్లలైనా పోలీస్ ఆఫిసర్ అవుతానని అనాలి’ అంటూ వచ్చే డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. మధ్యలో లవ్ ట్రాక్ అలరిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. సీరియస్ పోలీస్ పాత్రలో శ్రీవిష్ణు ఆకట్టుకుంటున్నాడు. ‘కోపం అంటే నాకు చిరాకు’ సర్ అంటూ చివర్లో వచ్చే డైలాగ్ ఆకట్టుకుంటుంది.
ఇది వరకే చిత్రం నుండి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. శ్రీ విష్ణు మొదటి సారిగా పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. పోలీస్‌గా డిఫరెంట్ వేరియేషన్‌ను చూపించాడు. డైలాగ్ డెలివరీ, పోలీస్‌గా విష్ణు హూందాతనం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also:
The Ghost Movie | ‘ది ఘోస్ట్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. నాగార్జునలోని మన్మధుడు బయటకొచ్చాడుగా..!
Project-k Movie | ‘ప్రాజెక్ట్-K’ కోసం ఐదుగురు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లు?
Samantha | సమంత ఆ అరుదైన రికార్డును క్రియేట్ చేసిందా?
Trivikram | తివిక్రమ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

