Allu Sirish | టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన అల్లు శిరీష్ కొత్త అడుగు వేయబోతున్నారు. ఆయన తన ప్రియురాలు నైనికాతో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టు ఇటీవల ప్రకటించడంతో మెగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అయితే, ఈ వేడుకకు వాతావరణం ఆటంకం కలిగించింది. దీంతో అల్లు శిరీష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్ చేస్తూ ..“చలికాలంలో అవుట్డోర్ నిశ్చితార్థం ప్లాన్ చేశాను… కానీ వాతావరణం, దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయ్” అని రాశారు. వర్షంలో డెకరేషన్ వర్క్స్ జరుగుతున్న ఫోటోను షేర్ చేయడంతో ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అక్టోబర్ 31న హైదరాబాద్‌లోని తమ సొంతింట్లోనే నిశ్చితార్థం ప్లాన్ చేశారు.. మొదట అవుట్‌డోర్‌లో, గ్రాండ్‌గా డెకరేషన్ చేసి, వెన్నెల వెలుతురులో స్టేజ్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. కానీ తుఫాన్ ప్రభావంతో నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ ఏర్పాట్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. వాతావరణం మెరుగుపడితే ఔట్‌డోర్‌లోనే వేడుక నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ, వర్షం కొనసాగితే సింపుల్‌గా ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం జరగనుందని సమాచారం. ఈ వేడుకకు కేవలం అల్లు అర్జున్, స్నేహా రెడ్డి కుటుంబం, అలాగే నైనికా కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు.
అల్లు శిరీష్ ఇటీవల నైనికా పేరును ప్రకటించినా, ఆమె ఫేస్‌ను రివీల్ చేయలేదు. అయితే దీపావళి సందర్భంగా జరిగిన కుటుంబ వేడుక ఫోటోల్లో అల్లు అర్జున్ భార్య స్నేహా అనుకోకుండా నైనికా ఫేస్ రివీల్ చేయడంతో సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకొని స్నేహా రెడ్డి ఆ తర్వాత ఫొటో డిలీట్ చేసినప్పటికీ అప్పటికే కొందరు స్క్రీన్ షాట్ తీసి నెట్టింట వైరల్ చేశారు. జంట చూడముచ్చటగా ఉందని చాలా మంది కామెంట్స్ చేశారు.