అల్లు వారి కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో శిరీష్. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు స్వయానా తమ్ముడు. నటుడిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్న శిరీష్ తన అన్నయ్య చాలా మారిపోయాడు అంటున్నాడు. ‘నన్ను చాలా అభిమానంతో చూస్తాడు. తమ్ముడిగా కాకుండా, కొడుకులానే భావిస్తాడు. చిన్నప్పుడు చాలా డిఫరెంట్‌గా ఉండేవాడు. ఇప్పుడు పక్కా ఫ్యామిలీ మ్యాన్ అయ్యాడు. తన భార్యాపిల్లలతోనే కాదు, ఇతర కుటుంబసభ్యులు, బంధువులతోనూ హ్యాపీగా కాలం గడుపుతున్నాడు. మమ్మల్ని వెకేషన్‌కు తీసుకెళ్లడం, సరదాగా ఉండటం.. ఇవన్నీ ఒక్కోసారి నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఎందుకంటే, నేనూ అన్నయ్యతోనే పెరిగాను! కానీ, ఎప్పుడూ తనలో ఈ కోణం గమనించలేదు. ఎక్కడున్నా, ఎంత బిజీలో ఉన్నా ఫ్యామిలీకి తొలి ప్రాధాన్యం ఇస్తున్నాడు’ అని చెబుతాడు శిరీష్.