అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బడ్డీ’. శామ్ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్ 2న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. టెడ్డీబేర్ నేపథ్యంలో సాగే ఈ కథ ఆద్యంతం ఉత్కంఠను పంచుతుందని, చక్కటి ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుందని చిత్రబృందం పేర్కొంది. హిప్హాప్ తమిళ అందించిన పాటలకు మంచి స్పందన లభిస్తున్నదని దర్శకుడు తెలిపారు. గాయత్రి భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా రాజేశ్‌సింగ్, ముఖేష్‌కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కృష్ణన్ వసంత్, సంగీతం: హిప్హాప్ తమిళ, రచన-దర్శకత్వం: శామ్ ఆంటోన్.