Allu Family | దీపావళి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా అంబరాన్నంటేలా జరుపుకున్నారు. ప్రతి ప్రాంతంలోనూ దీపాలతో, పటాసులతో, ఆనందోత్సాహాలతో పండుగ సందడి నెలకొంది. సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలను కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ తారలు ఈసారి దీపాల పండుగను మరింత ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తూ అభిమానులకు పండగ ట్రీట్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం నిర్మాత బండ్ల గణేశ్ తన ఇంట్లో అద్భుతంగా దీపావళి వేడుకలు నిర్వహించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, నాగార్జున ఫ్యామిలీలు కలిసి ప్రత్యేక వేడుకలు జరుపుకోవడం తెలుగు సినీ వర్గాల్లో హైలైట్‌గా మారింది.
ఇదిలా ఉంటే, నిన్న సాయంత్రం అల్లు ఫ్యామిలీ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కొత్త పెళ్లికొడుకు అల్లు శిరీష్, వారి భార్యలు, పిల్లలు అందరూ కలిసి పండుగ వాతావరణాన్ని మరింత అందంగా మార్చారు. ఆ ఫ్యామిలీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఫొటోలో అల్లు ఫ్యామిలీ కొత్త కోడలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇప్పటి వరకు శిరీష్ తనకి కాబోయే భార్యని పరిచయం చేయలేదు. దీపావళి రోజు ఆ సస్పెన్స్‌కి తెరదించారు. ఆ జంటని చూసిన అల్లు ఫ్యాన్స్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం శిరీష్.. ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద తన ప్రేయసి నైనిక చేతిని పట్టుకొని దిగిన ఫోటోను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోలో ఈఫిల్ టవర్ బ్యాక్‌డ్రాప్‌గా ఉండగా, వారిద్దరి మధ్య ఉన్న అనురాగం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫోటోను షేర్ చేస్తూ శిరీష్ ఒక ఎమోషనల్ మెసేజ్‌ను పోస్ట్ చేశాడు. “ మా తాతయ్య, నటరత్న డాక్టర్ అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా నా హృదయానికి దగ్గరైన ఓ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. నేను నైనికాతో నిశ్చితార్థం జరుపుకున్నాను” అని తెలిపారు. ఈ ప్రేమ కథ చాలా కాలంగా సీక్రెట్‌గా సాగినట్టు తెలుస్తోంది. ఇటీవల పారిస్‌లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగిందని సమాచారం. నైనిక హైదరాబాద్‌కు చెందిన అమ్మాయిగా చెప్పుకుంటున్నారు. అయితే ఆమె పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Whatsapp Image 2025 10 21 At 6.53.46 Am (1)