అల్లు అర్జున్ ఫ్యామిలీ పర్సన్ అనే సంగతి మనందరికి తెలిసిందే. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీతో చక్కర్లు కొడుతుంటాడు బన్నీ. వారితో విలువైన సమయం గడుపుతుంటాడు. మార్చి 6, 2011న స్నేహా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు బన్నీ. ఈ జంటకు 2014లో కొడుకు అయాన్, 2016లో కూతురు ఆర్హా పుట్టారు.
ఈ రోజు (సెప్టెంబర్ 29న) తన శ్రీమతి స్నేహ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. ‘నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీలాంటి ఒకరు నా లైఫ్‌లో ఉండడం నా అదృష్టం. మరెన్నో జన్మదినాలు నీతో గడపాలని కోరుకుంటున్నాను. హ్యాపి బర్త్ డే క్యూటీ’ అంటూ బన్నీ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. అల్లు అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు స్నేహాకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’లో నటిస్తున్నాడు. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమాలో మొదటి భాగం డిసెంబర్ విడుదల కానుంది. ఈ సినిమాలో పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే బన్నీకి సంబంధించిన లుక్స్ విడుదల కాగా, ఇవి నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.